ధర్నా చౌక్‌గా సచివాలయం

8
- Advertisement -

పరిపాలన కేంద్రంగా ఉండాల్సిన సచివాలయం కాంగ్రెస్ పాలనలో ధర్నాచౌక్ లా మారింది అని దుయ్యబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మొన్న చిన్న కాంట్రాక్టర్లు సచివాలయం లోపల ధర్నా చేస్తే.. బిల్లులు చెల్లించాలంటూ ప్రభుత్వ అద్దె వాహన యజమానులు సచివాలయం ఎదుట ఆందోళన చేసిన దుస్థితి నెలకొందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ, అసమర్థ పాలనకు నిదర్శనం ఇది…కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, చిన్న కాంట్రాక్టర్లు, చిరు ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు, జీతాలు నెలల తరబడి పెండింగ్ లో పెట్టడం శోచనీయం.వాహన అద్దె బిల్లులు హైదరాబాద్ లో 10 నెలలుగా, జిల్లాల్లో 2 సంవత్సరాలుగా పెండింగ్ లో పెట్టడం అన్యాయం అన్నారు.

కమీషన్లు ఇవ్వడం లేదని అద్దె వాహనాల బిల్లులు చెల్లించడం లేదా?..యజమానుల కష్టాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే అద్దె వాహనాల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Also Read:కే ర్యాంప్..బ్రేక్ ఈవెన్!

- Advertisement -