డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు

11
- Advertisement -

డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి విచారణ చేపట్టింది. అంతేగాదు హర్యానా ప్రభుత్వం, సీబీఐ నుండి నివేదికలు కోరింది. అలాగే కోర్టు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కార్యదర్శి, సీబీఐ, హర్యానా ప్రభుత్వం, అలాగే అంబాలా సైబర్ క్రైమ్ విభాగానికి నోటీసులు జారీ చేసింది.

న్యాయమూర్తుల సంతకాలను నకిలీగా ఉపయోగించి నకిలీ కోర్టు ఉత్తర్వులు తయారు చేయడం, న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకానికి, అలాగే చట్ట పరిపాలనకు తీవ్రమైన దెబ్బ అని. ఇలాంటి చర్యలు న్యాయ సంస్థ గౌరవానికి నేరుగా ముప్పు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఇటీవల ఒక వృద్ధ దంపతులు డిజిటల్ అరెస్ట్ స్కామ్ ద్వారా జీవిత పొదుపులను కోల్పోయిన ఘటనపై వారు చేసిన ఫిర్యాదు ఆధారంగా తీసుకుంది. సుప్రీంకోర్టు, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలపై హర్యానా ప్రభుత్వం మరియు అంబాలా సైబర్ క్రైమ్ ఎస్పీ నుంచి స్థితిగతుల నివేదిక (స్టేటస్ రిపోర్ట్) సమర్పించాలని ఆదేశించింది.

Also Read:ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు:హైకోర్టు

- Advertisement -