సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై విరుచుకు పడ్డారు మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డిలు కలిసి మా కుటుంబం మీద కుట్ర చేస్తున్నారు అన్నారు.
మా నాన్నను అరెస్ట్ చేసి, మా అమ్మను మంత్రి పదవి నుండి పీకేయాలని చూస్తున్నారు… ఈ ప్రభుత్వంలో రెడ్డిలు అంతా కలిసి బీసీలను తొక్కేస్తున్నారు అన్నారు. అసలు గన్ ఇచ్చిందే రేవంత్ రెడ్డి.. ఆ గన్ రోహిన్ రెడ్డి తెచ్చి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని డబ్బుల కోసం బెదిరించాడు అన్నారు. ఈ కేసును మా మనిషి సుమంత్ మీద తోసి, మా అమ్మ నాన్న మీదకు డైవర్ట్ చేయాలని చూస్తున్నారు అన్నారు.
మా అమ్మ నాన్న మీదకు వస్తే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరూ రెడ్డిల పని చెప్తా… అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులను మా ఇంటికి పంపి మా అమ్మను అరెస్ట్ చేసి, మా మీద మర్డర్ అటెంప్ట్ చేద్దామని చూశారు… రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డికి, కొండల్ రెడ్డికి గన్ మెన్లు ఎందుకు ఉన్నారు అసలు? చెప్పాలన్నారు.
మా అమ్మ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో పడ్డ టెండర్ ను పొంగులేటి వాళ్ళ మనిషికి ఇచ్చుకున్నాడు … మా కుటుంబానికి ఏం జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయి కొండా సుస్మిత హెచ్చరించారు.
Also Read:ప్రపంచ క్రీడా పటంలో భారత్!

