జన జీవన స్రవంతిలోకి మల్లోజుల

9
- Advertisement -

జన జీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు మావోయిస్టు పార్టీ అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ రావు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు మల్లోజుల.

పలువురు నక్సలైట్లతో కలిసి లొంగిపోవడానికి గడ్చిరోలి పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు నక్సల్ కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ రావు. మల్లోజులతో పాటు లొంగిపోనున్న దాదాపు 60 మంది నక్సలైట్లు లొంగిపోయారు.

మల్లోజుల స్వస్థలం కరీంనగర్ జిల్లాపెద్దపల్లి. మల్లోజుల తమ్ముడు కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ 2011 నవంబర్ 24న బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారు వేణుగోపాల్ రావు. అతడి భార్య తారా కూడా మావోయిస్టే. గతంలో ఆమె పది మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్‌ పై కోటి రూపాయల రివార్డు ఉంది.

Also Read:భద్రత కోసం మెటా కీలక నిర్ణయం

- Advertisement -