ఎన్నికల్లో పోటికి పీకే దూరం!

10
- Advertisement -

బీహార్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్. ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని, పార్టీ కోసం పని చేస్తానని వెల్లడించారు ప్రశాంత్ కిషోర్.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నవంబర్ 6న, రెండవ దశ ఓటింగ్ నవంబర్ 11న జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నవంబర్ 6న, రెండవ దశ ఓటింగ్ నవంబర్ 11న జరగనుంది. ఈ నేపథ్యంలో తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయరని, తన పార్టీ ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌కు వ్యతిరేకంగా రఘోపూర్ నియోజకవర్గం నుంచి మరో అభ్యర్థిని పోటీలో నిలిపిందని తెలిపారు.

ఇది పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం. నేను పోటీ చేస్తే, అవసరమైన సంస్థాగత పనులపై దృష్టి చెదరిపోతుంది అన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంగళవారం తొలి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 71 మంది అభ్యర్థులు ఉన్నారు. ఆర్జేడీ మాజీ కేంద్ర మంత్రి మరియు రాజ్యసభ సభ్యుడు రామ్ కృపాల్ యాదవ్ దానాపూర్ నుంచి పోటీ చేయనున్నారు.

Also Read:BB9:ఆరో వారం నామినేషన్స్ పూర్తి

- Advertisement -