మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గెలుపు ముంగిటవరకు వెళ్లి బోళ్తాపడింది బంగ్లాదేశ్ టీమ్. విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాపై అద్భుతంగా పోరాడి అందరినీ ఆకట్టుకుంది బంగ్లాదేశ్. 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 78 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. దీంతో నాడిన్ డి క్లర్క్ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టును కాపాడింది. చివరి ఓవర్లో మ్యాచ్‌ను గెలిపించింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ మహిళా జట్టు కెప్టెన్ నిగార్ సుల్తానా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. నా జట్టు ఆడిన తీరు నాకు గర్వంగా ఉంది… అమ్మాయిలు చివరి బంతి వరకు పోరాడారు. కానీ వాళ్లు చాలా చిన్నవాళ్లు.. గెలుపు దగ్గర్లో ఉండి ఓడిపోవడం వాళ్ల మనసును దెబ్బతీసింది అన్నారు. వాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడుస్తున్నారు. కానీ నేనెంతో గర్విస్తున్నాను, ఎందుకంటే వాళ్లు తమ ఎఫర్ట్స్ మొత్తాన్ని పెట్టారు అని ఆమె భావోద్వేగంగా చెప్పింది.
బంగ్లాదేశ్ ఓటమికి ప్రధాన కారణం క్యాచ్‌లు మిస్ చేయడమే. బంగ్లాదేశ్ తమ తర్వాత మ్యాచ్‌ను అక్టోబర్ 16న ఆస్ట్రేలియాతో ఆడనుంది.
Also Read:BB9:వైల్డ్ కార్డుల ఎంట్రీ..రచ్చరచ్చ

