BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ గారు,MLA ముఠాగోపాల్ గారు,MLC దాసోజు శ్రవణ్ కుమార్ గారి ఆదేశాలమేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్పేట్ డివిజన్ లోని వివేకానంద నగర్ లో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేయడం జరిగింది.
ఈసందర్బంగా BRS పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది అని అన్నారు. ఇచ్చిన హామీలలో ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు పడ్డ బాకీల గురించి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపినే చేశారు.
ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వారు ఇప్పుడు జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడుగుతే కాంగ్రెస్ భాకీ కార్డులు చూపించి వారిని నిలదీయాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో కెసిఆర్ గారు ప్రకటించిన అభ్యర్థి దివంగత మాజీ MLA మాగంటి గోపినాథ్ గారి సతీమణి ఆడబిడ్డ మాగంటి సునీత గారిని పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో గెలిపించాలని కురువ విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రంలో ఊస వేణు గోపాల్,ఎల్లేష్,రాకేష్,నాగరాజు,గోపి,శ్యాంయాదవ్,కుమార స్వామి,కమర్,నర్సింహా మూర్తి,కిరణ్,నరేష్,ప్రభుష తదితరులు పాల్గొన్నారు.
Also Read:పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై కేంద్రం

