ఓటు చోరి..ప్రత్యేక కార్యాచరణ:మహేష్ కుమార్

13
- Advertisement -

ఓటు చోరీ విషయంలో ఏఐసీసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసింది అన్నారు.

దేశ చరిత్రలో స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు అనేది ఒక పెద్ద సామాజిక విప్లవం…. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని ప్రజల్లో బలంగా తీసుకుని వెళ్లాలి అన్నారు. ఈ రోజు స్థానిక సంస్థలు నోటిఫికేషన్ వచ్చింది… మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నామినేషన్లు ప్రారంభం అయ్యాయి అన్నారు.

Also Read:పూణేలో ‘పెద్ది’

అక్టోబరు 15 నాటికి సంతకాల సేకరణ చేసి ఏఐసీసీకి పంపాలి… ప్రతి గ్రామానికి 100 చొప్పున సంతకాల సేకరణ చేసి పంపించాలి అన్నారు. డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సంతకాల సేకరణ పూర్తి చేయాలి అన్నారు మహేష్ కుమార్ గౌడ్.

- Advertisement -