ట్రంప్..ది పీస్ ప్రెసిడెంట్!

6
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పలుమార్లు వైట్ హౌస్ ప్రతినిధులు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్‌ బహుమతులకు సంబంధించి.. వివిధ విభాగాలకు విజేతలను ప్రకటిస్తోంది.

రేపు నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ఆసక్తికర ట్వీట్‌ చేసింది. ట్రంప్‌ను ది పీస్‌ ప్రెసిడెంట్‌గా పేర్కొంది. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది.

Also Read:ఇందిరమ్మ పాలన కాదు..ఎమర్జెన్సీ:హరీష్

- Advertisement -