BRS..ఛలో బస్ భవన్

4
- Advertisement -

పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని చలో బస్ భవన్ కు పిలుపునిచ్చింది బీ ఆర్ ఎస్. రేతి ఫైల్ బస్టాండ్ నుంచి బస్సులు బస్సు భవన్ కు రానున్న బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి.

మెహదీపట్నం నుంచి బస్సులో బస్ భవన్ కు మాజీ మంత్రి హరీష్ రావు,ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, చింతల్ నుంచి కేపీ వివేకానంద ,బస్సు భవన్ కు నేతలు చేరుకొని ఆర్టీసీ ఎండి నాగిరెడ్డికి చార్జీలు తగ్గించాలని వినతి పత్రం ఇవ్వనున్నారు.

సోమవారం నుంచి సిటీ బస్ లో చార్జీలు పెంచింది టిజిఎస్ ఆర్టీసీ. ఒకటి నుంచి నాలుగో స్టేజి వరకు ఐదు రూపాయలు ఆ పై స్టేజీల కు పది రూపాయలు పెంచుతూ టీజీఎస్ఆర్టిసి నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి స్కీమ్ తో తీవ్ర నష్టాల్లో ఆర్టీసీ ఉండగా మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి మగవాళ్ళ నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే నగరంలో ఉచిత బస్సులు తగ్గగా సమర్థవంతంగా మహాలక్ష్మి స్కీమ్ అమలవుతుందని చెప్తున్న ప్రభుత్వం ఎందుకు చార్జీలు పెంచిందని ప్రయాణికుల నుంచి నిరసన వస్తోంది. పండగలకు ప్రత్యేక చార్జీల పేరిట ప్రయాణికులు జేబుకు చిల్లు పెడుతోంది ఆర్టీసీ.

Also Read:జూబ్లీహిల్స్ .. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్

- Advertisement -