పాక్‌కు వ్యతిరేకంగా PoKలో ఆందోళనలు

11
- Advertisement -

పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా PoKలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొనసాగుతున్న నిరసనలను సోమవారం మరింత ఉధృతం చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు చెబుతున్నారు నిరసనకారులు. 70 ఏళ్లకుపైగా పీవోకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని అవామీ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు PoKలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని.. తమ 38 డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ‘షటర్-డౌన్.. వీల్-జామ్” పేరుతో సమ్మెకు పిలుపునిచ్చారు.

Also Read:స్థానిక సంస్థల ఎన్నికలు..పూర్తి వివరాలు

- Advertisement -