ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డదో.. ప్రభుత్వాన్ని నిలదీసి అడిగేందుకే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేశాం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ప్రతీ ఇంటికి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు పంపిస్తామన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల నుండి క్షేత్ర స్థాయి నాయకుల వరకు, అందరం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఈ బాకీ కార్డులను తీసుకెళ్లి ఇస్తాం అని తెలిపారు.
బాకీ కార్డును ప్రతి ఇంటికి పంపిస్తాము.. అప్పుడు ప్రజలు మిమ్మల్ని గల్లా పట్టుకొని అడుగుతారు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ప్రజలు ఏ రకంగా తిరగపడుతున్నారో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో చూశామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కాలం దగ్గర పడ్డది అన్నారు.
ఎన్నికల ముందు రజినీకాంత్ లాగా మాట్లాడి.. ఎన్నికల తర్వాత గజినీకాంత్ లాగా రేవంత్ రెడ్డి మారిపోయాడు… ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు.. కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అన్నారు. అందులో కూడా రెండు రకాల కటింగులు.. గత ప్రభుత్వంలో ప్రారంభించిన వాటికి రిబ్బన్ కటింగులు, ఇంకోటి ఏమో కేసీఆర్ ప్రారంభించిన మంచి పథకాలను కటింగ్ చేస్తున్నాడు అన్నారు.
డీజీపీకి నియామక పత్రం ఇవ్వడం చరిత్రలో ఎక్కడా చూడలేదు అన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రేవంత్ రెడ్డి ప్రచారం కోసం డీజీపీకి కూడా నియామక పత్రం ఇచ్చాడు.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి అలవాటులో డీజీపీకి కూడా నియామక పత్రం ఇచ్చాడు అన్నారు.
Also Read:కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు రిలీజ్

