42శాతం రిజర్వేషన్లు..హైకోర్టులో పిటిషన్

8
- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ ఐన జీవో నెంబర్ 9 పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు బుట్టెంగారి మాధవరెడ్డి.

అయితే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల జీవోను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది.

12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించనున్నారు. అనంతరం పరోక్షంగా 565 మండల పరిషత్‌లు, 31 జిల్లా పరిషత్‌లకు జరగనున్న చైర్ పర్సన్ ల ఎన్నిక జరగనుంది.

Also Read:ప్రతీ ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డు:కేటీఆర్

- Advertisement -