పూరి-విజయ్…స్లమ్ డాగ్!

13
- Advertisement -

స్టైలిష్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌కి సంబంధించిన న్యూస్ లీక్ అయింది. ఈ సినిమాకు స్లమ్ డాగ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారని తెలుస్తోంది.

సెప్టెంబర్ 28, 2025న పూరీ జగన్నాథ్ జన్మదినం సందర్భంగా ఈ చిత్రానికి అధికారిక టైటిల్‌తో పాటు టీజర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్రంలో సంయుక్త, టబు, దునియా విజయ్, బ్రహ్మాజీ, విటివి గణేష్ మరియు మరికొందరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ మరియు జేబీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:TG:స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు

- Advertisement -