హైకోర్టులో స్మితా సబర్వాల్‌కు ఊరట

8
- Advertisement -

హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు ఊరట దక్కింది. జస్టిస్ ఘోష్ నివేదిక పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఐఏఎస్ స్మితా సబర్వాల్. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా స్మితాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని కోరుతూ స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కమిషన్ తనకు సాక్షిగా సమన్లు మాత్రమే జారీ చేసిందని, చట్టప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు స్మితా సబర్వాల్.

కమిషన్ నాపై పక్షపాతంతో పరువు నష్టం కలిగించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని.. ఈ నివేదికను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు స్మితా.

Also Read:వెంకట్ మృతి..సాహిత్య రంగానికి తీరని లోటు

- Advertisement -