- Advertisement -
గ్రూప్-1 విషయంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట దక్కింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది డివిజన్ బెంచ్. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది న్యాయస్థానం.
గ్రూప్-1 జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించాలని.. లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ తీర్పు ఇచ్చారు హైకోర్టు సింగిల్ జడ్జి.
ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది టీజీపీఎస్సీ . ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం తాజాగా సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read:OG తుపాను..బుక్ మై షోలో రికార్డు!
- Advertisement -

