- Advertisement -
సిక్కు వేర్పాటువాది గుర్‌పత్‌వంత్ సింగ్ పన్నున్‌పై NIA కేసు నమోదు చేసింది. ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగరవేయకుండా అడ్డుకుంటే రూ.11 కోట్ల రివార్డు ఇస్తానని గుర్‌పత్‌వంత్ సైనికులను రెచ్చగొట్టాడని ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేశారు.
దేశంలోని కొన్ని ప్రాంతాలను కలుపుకుంటూ కొత్తగా ఖలిస్థాన్ మ్యాప్‌ను విడుదల చేసి దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.పాకిస్థాన్‌లో ఉంటూ ఖలిస్థాన్ వాదాన్ని బలంగా సమర్థిస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపించింది NIA.
అయితే.. ఈ చర్య NIA పరిధిలోకి వచ్చే షెడ్యూల్డ్ నేరమని, దీనిపై వెంటనే విచారణ జరపాలని తెలిపింది NIA.
Also Read:ఏపీ సీఎం చంద్రబాబుకు సీఐ లీగల్ నోటీసు
- Advertisement -

