పేదల ఇళ్లనే ఎందుకు కూలుస్తున్నారు?:కేటీఆర్

6
- Advertisement -

పేదల ఇళ్ళను రేవంత్ రెడ్డి ఆదివారం ఎందుకు కూల్చివేస్తున్నారు? చెప్పాలని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్…గతంలో హైకోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు చేయవద్దని స్పష్టంగా చెప్పింది…అయినప్పటికీ గాజులరామారంలో కోర్టు సెలవు దినమే చూసుకుని పేదల ఇళ్ళను కూల్చివేశారు…గాజులరామారంలో ఇళ్లు కూల్చి, రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్ రెడ్డి బుల్డోజర్‌తో వస్తారని అంటారు..కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఇళ్లు కూలగొట్టమని కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లే అన్నారు.

మన పార్టీ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేశారు. కాంగ్రెస్ పార్టీ కూల్చిన ఆ ఇంటిని మళ్లీ కట్టి ఇవ్వడం నా బాధ్యత..కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది. రెండు సంవత్సరాల్లో పరిస్థితికి ఏమి చేయలేదు…బుల్డోజర్ పేదల ఇళ్లపైకి మాత్రమే వెళ్తుంది; పెద్దల ఇళ్లకు వెళ్ళదు…ముఖ్యమంత్రి సోదరుడితో పాటు మంత్రులు పొంగులేటి, వివేక్ వంటి వారు ప్రభుత్వ స్థలాల్లో, చెరువుల పైన ఇళ్లు కట్టినా వారిని కూల్చలేదు…ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల్లోనే పెద్ద నేతలు—మంత్రి వివేక్, కేవీపీ రామచంద్ర రావు, మంత్రి పొంగులేటి వారి ఇళ్ళు ఉన్నాయి. వాటిని కూల్చలేదు చెప్పాలన్నారు.

ఆదివారం, శనివారం మాత్రమే పేదల ఇళ్లు బుల్డోజర్లతో కూలేస్తున్నారు..హైదరాబాద్‌ను బాగా అభివృద్ధి చేశాం. 42 ఫ్లైఓవర్లు కట్టించాం…రాహుల్ గాంధీకి ఇవి కనపడవు…రేవంత్ రెడ్డి జెండా కాంగ్రెస్, ఎజెండా బీజేపీది.అక్కడ బుల్డోజర్లను వ్యతిరేకించేవారు; ఇక్కడే అదే బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూలగొడుతున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.హిందువులు, ముస్లింలు అంటూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క పంచాయతీ కూడా కాలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి?,పదేళ్లుగా జోరుగా నడిచిన పాలన ఇప్పుడు ఆగిపోయింది.కేసీఆర్ లేఖ చెప్పినట్టే ఉంటే, ఇచ్చారా? (కేసీఆర్ లక్ష ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు — ఇచ్చారా?),అప్పు పుట్టట్లేదు అని ఎవరో ముఖ్యమంత్రి చెప్తారా?..రాష్ట్రానికి సీఎం ఇలా మాట్లాడతారా? దొంగను దొంగనే అంటారు అన్నారు.

అందుకే జూబ్లీహిల్స్, జీహెచ్‌ఎంసీ ఈ రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేయాలి…నిన్న మోదీ వచ్చి ఏదో చెప్తాడు అనుకున్నాం…హెచ్-1బి వీసా గురించి మాట్లాడుతాడు అనుకున్నాం.జీఎస్టీపై పండగ చేసుకోమని చెప్తున్నారు.మొన్నటి వరకు రక్తం తాగి ఇప్పుడు తగ్గించి పండగ చేసుకోమని మాట్లాడుతున్నారు,గ్యాస్ ధరలు అప్పుడు ₹450 ఉండేవి; ఇప్పుడు విపరీతంగా పెరిగాయి…ఎనిమిది ఏళ్లు గుంజి డబ్బులు ఇస్తే, లేదంటే పదిహేను లక్షలు ఇస్తామన్నారు — అది ఇచ్చారా?,
ముడి తైల ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు…ఎలా పండగ చేసుకోవాలి? రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? చెప్పాలన్నారు.

Also Read:స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు!

- Advertisement -