పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం OG. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌తోనే అంచనాలను ఆకాశానికెత్తేసింది. ఈ భారీ చిత్రంతో ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ చిత్రాన్ని DVV ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా వస్తుండటంతో ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్‌తో ఊగిపోతోంది.ఇక చౌటుప్పల్‌లో రికార్డు స్థాయిలో OG సినిమా బెనిఫిట్ షో ఫస్ట్ టికెట్ దక్కించుకున్నారు అభిమాని. రూ.1,29,999లకు టికెట్ దక్కించుకున్నారు అభిమాని ఆముదాల పరమేష్. టికెట్‌ను జబర్దస్త్ కమెడియన్ వినోదిని చేతుల మీదుగా అందజేశారు. వేలంపాటలో పాడిన డబ్బులను జనసేన పార్టీ కార్యాలయానికి అందజేయనున్నట్లు తెలిపారు అభిమాని ఆముదాల పరమేష్.
తెలుగు రాష్ట్రాల్లో ఓజీ టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు స్పెషల్ ప్రీమియర్ టికెట్ రేటు రూ. 800 కాగా 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్ రూ.100, మల్టీఫ్లెక్స్ రూ.150గా టికెట్ ధరలు ఉన్నాయి.
Also Read:సింగరేణి కార్మికులకు 34 శాతం బోనస్

