బ్యాంకు లోన్ ఎగ్గొట్టేందుకు..ఏకంగా!

10
- Advertisement -

బ్యాంకు లోన్ ఎగ్గొట్టేందుకు ఏకంగా చనిపోయినట్లు కథ అల్లారు ఓ బీజేపీ నేత కుమారుడు. మధ్యప్రదేశ్‌లో బ్యాంకుల నుండి రూ.1.40 కోట్ల రుణం తీసుకున్నారు రాజ్‌గఢ్ బీజేపీ నేత మహేష్ సోని కుమారుడు విశాల్ సోని.

తాను చనిపోయినట్లు నమ్మిస్తే బ్యాంకు రుణాల నుండి విముక్తి దొరుకుద్దని, కలిసింధ్ నదిలో కారును పారేసి నాటకమాడారు విశాల్ సోని. 10 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టి, కారును వెలికి తీసి అది విశాల్ సోనీదిగా గుర్తించారు రెస్క్యూ సిబ్బంది. ఆ తర్వాత విశాల్ సోనీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరో వారం రోజుల తర్వాత కూడా నదిలో ఎలాంటి జాడ దొరకకపోవడంతో, అనుమానంతో విశాల్ సోనీ మొబైల్ కాల్ డేటాను పరిశీలించారు పోలీసులు. చివరి సిగ్నల్స్ మహారాష్ట్రలో ఉండడంతో మహారాష్ట్ర – శంభాజీ నగర్ జిల్లాలోని ఫర్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశాల్ సోనీని అరెస్ట్ చేశారు.

తనకు రూ.1.40 కోట్ల అప్పు ఉందని, మరణ ధృవీకరణ పత్రం లభిస్తే బ్యాంకు రుణాల నుండి తప్పించుకోవచ్చని డ్రామా ఆడినట్లు ఒప్పుకున్నారు విశాల్ సోనీ. మరణించినట్లు డ్రామా ఆడడం వల్ల కేసు వేయడానికి రాజ్యాంగ నిబంధన లేదని, ఎలాంటి శిక్ష వేయకుండా విశాల్ సోనీని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు.

Also Read:TTD:శేషాచల స్వామి ఆలయంలో ఉత్సవాలు

- Advertisement -