మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. చిన్న పాటి వర్షానికే పొంగిపొర్లుతున్న నాలాలు, చివరికి ప్రజల ప్రాణాలు హరిస్తుంటే మున్సిపల్ మంత్రిగా కూడా ఉండి ఏం చేస్తున్నట్టు ? విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తీర్చేందుకు ఏర్పాటుచేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను కూడా నిర్వీర్యం చేయడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు.
మీ కాంగ్రెస్ సర్కారు ఘోర తప్పిదం వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి మరణించిన ఆరుగురి మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశావు. చివరికి హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి పార్థివదేహాలను మూడురోజులైనా గుర్తించలేవా..? చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇంతకన్నా అసమర్థతత, చేతకానితనం, పరిపాలనా వైఫల్యం ఇంకోటి ఉంటదా..?? కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత, మానవత్వం లేని కాంగ్రెస్‌కు వినిపించడం లేదా ? అని ప్రశ్నించారు. ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ఆరుగురిని సజీవ సమాధి చేసి ఇప్పటికే మహాపాపం మూటగట్టుకున్నారు.. నాలాల్లో బలిచేసిన ముగ్గురి మృతదేహాలను కూడా గుర్తించకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read:ప్రభాస్-ప్రశాంత్ వర్మ..గేమ్ ఆన్!

