ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్‌లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా రూ.36,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సభలో ప్రసంగించనున్నారు మోదీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం పెరిగింది.
ప్రధాని మోదీ ప్రారంభించనున్న ముఖ్య ప్రాజెక్టులు
()నూతన ఎయిర్పోర్ట్ టర్మినల్ ప్రారంభం – ఇది బీహార్‌లో కనెక్టివిటీని మరింత మెరుగుపరచనుంది.
()జాతీయ మఖానా బోర్డు ఆవిష్కరణ – దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి, వేలకొద్దీ ఉద్యోగాలు సృష్టించబడతాయి.
Also Read:‘మిరాయ్’కి అద్భుత స్పందన
()40,000 మందికి పైగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) లబ్ధిదారుల కోసం గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం.
()స్వయం సహాయక సంఘాలకు రూ.500 కోట్లు పంపిణీ.
బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సమ్రాట్ చౌధరీ మాట్లాడుతూ, “డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల బీహార్ విపరీతమైన లాభం పొందుతోంది. గత 11 ఏళ్లలో ప్రధాని మోదీ బీహార్‌కు సుమారు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను అందించారు. రేపు మరొక అభివృద్ధి పర్వం ప్రారంభం కానుంది అని తెలిపారు. ఆగస్టు 22న కూడా ప్రధాని మోదీ బీహార్‌లో రూ.13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

