మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్)కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించిన సంగతి తెలిసిందే. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు.
ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. హైదరాబాద్ పచ్చదనాన్ని 24% నుంచి 33%కు పెంచినందుకు గుర్తింపుగా సెప్టెంబర్ 24న న్యూయార్క్ సిటీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు అందుకోవడం నిజంగా గర్వించదగ్గ విశేషం అన్నారు. ఇది హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి సస్టైనబిలిటీ మ్యాప్‌పై నిలిపిన మరో గొప్ప మైలురాయి.. మీ నాయకత్వం నిజంగా ప్రేరణాత్మకం..ఇంకా ఎన్నో విజయాలు రాబోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అన్నారు.
Big congratulations @KTRTRS annayya, on being honoured with the Green Leadership Award at the NYC Green School Conference on 24th September for taking Hyderabad’s green cover from 24% to 33%, which is truly remarkable feat. This is yet another milestone putting Hyderabad on the… pic.twitter.com/74E1P57eIW
— Santosh Kumar J (@SantoshKumarBRS) September 11, 2025
Also Read:మిరాయ్..ప్రీమియర్స్‌కి అద్భుత స్పందన!

