తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

9
- Advertisement -

ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రానున్న 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఏపీలోని అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

Also Read:కాంగ్రెస్‌ అహంకారానికి ఓటుతో బుద్ధిచెప్పాలి

- Advertisement -