ఆసియా కప్ టీ20లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్ ఘన విజయం సాధించింది. ఆప్ఘాన్ విధించిన 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్… కేవలం 94 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 94 పరుగుల తేడాతో ఆప్ఘాన్ విజయం సాధించగా ఆ జట్టులో బాబర్ హయత్ (39 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘాన్ ఆరంభం నుండే ధాటిగా ఆడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్ సాదిఖుల్లా అటల్ 52 బంతుల్లో 73 (నాటౌట్) ,అజ్మతుల్లా ఒమర్జాయ్ 21 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ముఖ్యంగా అజ్మతుల్లా 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని అఫ్గాన్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా, ఆయుశ్ శుక్లా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read:భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్

