నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) సహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లను నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఈ ఆందోళనలకు నాంది పలికింది. అయితే ఆందోళనలు క్రమంగా అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలపై కూడా కేంద్రీకృతమయ్యాయి.
భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో కనీసం 19 మంది మృతి చెందారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఓలి మంత్రివర్గంలో పలువురు రాజీనామా చేయగా, చివరికి సోషల్ మీడియా నిషేధాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే ఆ సమయంలోనే ప్రధాని ఓలి పదవికి వైదొలగాల్సి వచ్చింది. నేపాల్ లోని భారత ఎంబసీ కార్యాలయం ప్రకటన చేసింది.
నేపాల్ లో ఉన్న భారత పౌరులకు సమస్యలకు, సహకారం కోసం అత్యవసర ఫోన్ నంబర్లను ప్రకటించింది దౌత్య కార్యాలయం. +977 – 980 860 2881 , +977 – 981 032 6134 నెంబర్లను సంప్రదించాలని సూచించింది. గత 17 ఏళ్లలోనే నేపాల్‌లో 13 ప్రభుత్వాలు మారడం రాజకీయ అస్థిరతకు నిదర్శనం. రాజ్యాంగ రాజ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్లు మళ్లీ బలపడుతున్నాయి.
Also Read:ది రాజా సాబ్..ఫస్ట్ సింగిల్

