- Advertisement -
సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుండగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్.
ఈ నెల 19న విజయవాడ, 21న హైదరాబాద్ లో రెండు భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లు నిర్వహించనున్నట్టు సమాచారం.హైదరాబాద్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.
ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ మొదలుకాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నార్త్ అమెరికాలో ఇప్పటికే లక్షలాది టికెట్లు అడ్వాన్స్ బుకింగ్‌లో అమ్ముడయ్యాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించనున్నట్టు సమాచారం.
Also Read:మిరాయ్..గూస్‌బంప్స్ గ్యారెంటీ!
- Advertisement -

