రేవంత్ రెడ్డి 563 గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నాడు అని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద సీబీఐ ఎంక్వయిరీ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అన్నారు.
దీంట్లో అక్రమాలు జరిగాయని కోర్టే చెప్పింది.. అందుకే బండి సంజయ్ సీబీఐ ఎంక్వయిరీ వెయ్యమని కోరాలి అని డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేసింది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల పేపర్లను రీవాల్యుయేషన్ చేసి, దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. ఒకవేళ సాధ్యం కాకపోతే, పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Also Read:ఇంపాక్ట్ ఫుల్‌గా ‘భద్రకాళి’

