సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సిగ్గుందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… గత వారమే కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు ఆడి, ఈరోజు అదే కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుండి మూసీకి నీళ్లు అనుసంధానం చేస్తున్నాడు అన్నారు.
తల ఉన్నోడు ఎవడైనా తల దగ్గర శంకుస్థాపన చేస్తాడు.. తల తోక లేని రేవంత్ రెడ్డి తోక గండిపేట దగ్గర శంకుస్థాపన చేస్తున్నాడు.. తల మల్లన్న సాగర్ దగ్గర చేస్తే కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు ఆడి, అందులో భాగమైన ప్రాజెక్ట్ దగ్గరే శంకుస్థాపన చేస్తావా అని చెప్పుతో కొడతారని తోక దగ్గర చేస్తున్నాడు అన్నారు. ఇన్నిరోజులు కాళేశ్వరం కూలేశ్వరం అని వాగిన నోర్లే.. ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకువచ్చి హైదరాబాద్ ప్రజలకు గోదావరి నీళ్లు అందిస్తున్నామని చెప్తున్నారు అన్నారు.
అంటే రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లు కాళేశ్వరం తెలంగాణకు కల్పతరువు, కామధేనువని… అలానే గంధమల్ల రిజర్వాయర్ కూడా శంకుస్థాపన చేసిన రోజు నేను పూర్తి చేస్తానని రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అన్నారు. కానీ గంధమల్లకు కూడా అదే కాళేశ్వరానికి అనుసంధానమైన కొండ పోచమ్మ నుండే నీళ్లు వచ్చేది – కేటీఆర్ మీరు ఏమో కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని చెప్తున్నారు.. మరి మీరు ఇచ్చిన పుస్తకంలోనే 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్లుగా ఉందని అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశాడు అన్నారు.
కాళేశ్వరం కొట్టుకపోయింది అంటున్నారు కానీ 12 లక్షల కూసెక్కుల వరద వచ్చినా బ్యారేజీ బాగానే ఉంది కదా అని అక్బరుద్దీన్ ఒవైసీ అడిగారు … 20 నెలలుగా దాన్ని ఎందుకు రిపేర్ చేయడం లేదని కూడా వారు అడిగారు అన్నారు కేటీఆర్.
Also Read:వైసీపీ ఎంపీ బెయిల్ పిటిషన్ వాయిదా

