బిహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధానపార్టీలన్ని ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఇక ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా హెలికాప్టర్లను బుక్ చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు.
ఇది గత ఎన్నికలతో పోలీస్తే మూడు రేట్లు ఎక్కువ. అంటే బిహార్లో ప్రతిరోజూ 20 హెలికాప్టర్లు ఎగురనున్నాయి. బీజేపీ, జేడీయూ కూటమి డజనుకు పైగా హెలికాప్టర్లను బుక్ చేసుకుంది. బీజేపీ నాయకులు రోజుకు 12- 13 హెలికాప్టర్లను ఉపయోగించనున్నారు. జేడీయూ ప్రతిరోజూ రెండు హెలికాప్టర్లు వాడనుంది. విపక్ష మహాకూటమిలోని పార్టీలు ఐదు హెలికాప్టర్లతో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయనున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ చెరో రెండు హెలికాప్టర్లు వాడుకోనున్నాయి.
సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ ఛార్జీ గంటకు రూ. లక్ష- రూ. 2 లక్షలు ఉండగా, డబుల్ ఇంజిన్ హెలికాప్టర్ ఛార్జీ గంటకు రూ. 3లక్షలు-రూ.4 లక్షల వరకు ఉంది. హెలికాప్టర్ బుక్ చేసుకునే పార్టీలు, నాయకులు 3 గంటలకు ఫ్లయింగ్ ఛార్జీ చెల్లించాలి. అదనంగా 18శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. అంటే రాజకీయ పార్టీలు హెలికాప్టర్ కోసం ప్రతిరోజూ దాదాపు రూ. 11 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
Also Read:TG:దసరా సెలవులివే

