రివ్యూ: ఖ‌య్యూం భాయ్

326
Khayyum Bhai Movie review
Khayyum Bhai Movie review
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో పలు హత్యలు,దోపిడిలు చేసి ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్ట‌ర్‌ న‌యీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖ‌య్యూం భాయ్‌`.నయీం ఎన్‌కౌంటర్ తరువాత కొద్దిరోజులు టీవీల్లో నయీం గురించే కథనాలు వరుసగా రావడంతో ఈ సినిమాకు అటెన్షన్ వచ్చింది. మరి ఇంతకు నయీం నేర జీవితం తెరపై ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే…

కథ :
చిన్నప్పటి నుండే జల్సాలకు అలవాటు పడ్డ ఖయ్యూం నేర ప్రవృత్తినే వృత్తిగా ఎంచుకుంటాడు. యుక్తవయసులోనే చెడు స్నేహాలు చేసి నక్సలైట్ల పట్ల ఆకర్షితుడు అవుతాడు. నక్సలైట్లతో బేధాభిప్రాయాలు ఏర్పడటంతో బయటికొచ్చి పోలీసులతో చేతులు కలిపి కోవర్టుగా మారతాడు. నక్సలైట్ల రహస్యాలు పోలీసులకు చేరవేస్తూ నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేయిస్తూ పోలీసులతో దోస్తీ కడతాడు. పోలీసులతో్ ఉన్న సంబంధాలను వాడుకొని దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తాడు. రియల్‌ ఎస్టేట్‌లో కూడా బెదిరింపులకు పాల్పడుతుంటాడు. వినకపోతే కిరాతకంగా హత్యలు కూడా చేస్తాడు. ఇలా పోలీసు వయ్వస్థనే తన బలంగా చేసుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన ఖ‌య్యూం.. తనకు అండగా నిలిచిన ప్రభుత్వానికే ప్రమాదంగా పరిణమిస్తాడు. ఇక లాభం లేదనుకున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం ఖ‌య్యూంని హతం చేస్తారు. కథ నిజమైందే అయినప్పటికీ సినిమా నేపథ్యంగా సాగుతుంది.. అసలు నయీం ఎంతమంది హత్య చేస్తాడు ? ఎన్ని వేశాలు మారుస్తాడనేది సినిమా.

khayyum movie

ప్లస్ పాయింట్స్ :
సినిమాకు ప్రధాన బలం కథ… గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడమే. నయీమ్ పాత్రదారి క‌ట్టా రాంబాబు పోలికల్లో చూడ్డానికి చాలా వరకు నయీమ్ లానే ఉండటం చెప్పుకోదగ్గ అంశం. నయీం ఎన్‌కౌంటర్ తరువాత మీడియాలో దాదాపు అన్నివిషయాలు భయట పడ్డాయి. అయినా సినిమాటిక్‌గా చూడాలనే ఇంట్రస్ట్‌ వచ్చేలా అనిపిస్తుంది. అసలు నయీమ్ లైఫ్ స్టైల్, అతను క్రైం చేసే విధానం ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సుకత క్రియేట్ అయింది. సినిమాలో లోతుకి వెళుతున్న కొద్ది ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీంతో సినిమాలో చాలా సేపు ఏవైనా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయేమో అనే యాంగ్జైటీ వచ్చింది.

మైనస్ పాయింట్స్ :
పైన చెప్పుకున్నట్లు నయీంకు సంబంధించిన అన్ని విషయాలు మీడియాలో వచ్చినవే. గ్యాంగ్ స్టర్ నయీము ఎవరెవర్ని హత్య చేశాడు, ఎలా చనిపోయాడు అనే విషయాలు అందరికీ తెలిసినవే. బలహీనమైన స్క్రీన్ ప్లేతో, డైలాగులతో సినిమాను చుట్టేశాడు. ఇక వాస్తవ కథకు అతనిచ్చిన సినిమాటిక్ టచ్ కూడా పరమ రొటీన్ గా అనిపించింది. సినిమా మొదలైన అరగంటకు కూడా నయీమ్ పాత్రను ప్రవేశపెట్టకుండా ఎసిపి సత్య (తారకరత్న) యొక్క రొమాంటిక్ ట్రాక్ ను నడిపి ఆరంభంలోనే నిరుత్సాహపరిచేశాడు. ఇక మధ్యలో వచ్చే పాటలు, మరీ ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్ పెద్ద తలనొప్పిగా పరిణమించాయి.

Tharakaratna in Khayyum Bhai

అసలు సామాన్య జనానికి తెలియని నయీమ్ ఆ హత్యలు ఎందుకు చేశాడు, ఎవరి కోసం చేశాడు, ఎలా చేశాడు, అతని ఎన్కౌంటర్ వెనుక ఎవరున్నారు, అతని నేర చరిత్రలో పోలీసుల భాగస్వామ్యమెంత, అసలు నయీమ్ ఎలాంటి జీవితం గడిపేవాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, ముఖ్య వ్యక్తుల హత్యలకు ప్లాన్ ఎలా రెడీ చేసేవాడు, వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేసేవాడు అనే అంశాలను పరిశోధన చేసి చెప్పాలి. నయీమ్ పాత్రదారి కట్టా రాంబాబు లో సీరియస్ నెస్, క్రుయాలిటీ కనిపించలేదు. నయీమ్ అంటే ఇంతేనా, ఇలానే ఉంటాడా అనే తక్కువ స్థాయి భావన కలిగింది. క్లైమాక్స్ లో నయీమ్ ఎన్కౌంటర్ వెనకున్న అసలు వాస్తవాల్ని అయినా చూపిస్తారేమో అనుకుంటే దాన్ని కూడా రొటీన్ గా, ఉన్నపళంగా ముగించేయడం అస్సలు నచ్చలేదు.

సాంకేతిక విభాగం :
దర్శకుడు భరత్ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం నేర జీవితాన్ని తెరపై ఆవిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. కేవలం న్యూస్ పేపర్, టీవీ ఛానెళ్ల ఇన్ఫర్మేషన్ తో.. కొత్త విషయాలు చెప్పకుండా ఆయన తయారుచేసుకున్న స్క్రిప్ట్‌ బాగాలేదు. ఇక శేఖర్ చంద్ర అందించిన సంగీతం పర్వాలేదనిపించినా… ఐటమ్ సాంగ్ అయితే చిరాకు పుట్టించేసింది. కెమెరా పనితనం బాగాలేదు. నిర్మాణ విలువలు అసలేం లేవు.

తీర్పు :
గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవితం ఆధారంగా దర్శకుడు భరత్ రూపొందించిన ఈ ‘ఖ‌య్యూంభాయ్’ చిత్రం ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. నయీమ్ పాత్రదారి కట్టా రాంబాబు చూసేందుకు కొంచెం నయీమ్ పోలికలతోనే ఉన్నా అతని నటనలో మాత్రం నయీం కనిపించలేదు. కొత్త అంశాలు చెప్పకపోగా సామాన్య జనం టీవీల్లో, పేపర్లో చూసి తెలుసుకున్న విషయాలనే చూపించడం జరిగింది. క్లైమాక్స్ లో నయీమ్ ఎన్కౌంటర్ వెనకున్న అసలు వాస్తవాల్ని అయినా చూపిస్తారేమో అనుకుంటే దాన్ని కూడా రొటీన్ గా, ఉన్నపళంగా ముగించేయడం అస్సలు నచ్చలేదు.

విడుదల తేదీ: 30/06/2017
రేటింగ్ : 2/5
నటీనటులు: క‌ట్టా రాంబాబు, తార‌క‌ర‌త్న
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత: శ్రీ‌మ‌తి క‌ట్టా శార‌ద చౌద‌రి
దర్శకత్వం: భరత్‌

- Advertisement -