తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ తయారీ గుట్టురట్టు అయింది. దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. MD డ్రగ్స్ తయారీ యూనిట్ లో మహారాష్ట్ర పోలీసుల సోదాలు నిర్వహించారు.
డ్రగ్స్ తయారీకి ఉపయోగపడే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. 35 వేల లీటర్ల ప్రికర్సర్ కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు మహారాష్ట్ర పోలీసులు . MD డ్రగ్స్ తయారు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తోంది ఈ ముఠా. మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు.
Also Read:పుష్ప 3పై సుకుమార్ క్లారిటీ
గత నెలలో మహారాష్ట్ర పోలీసులకు ఓ విదేశీయుడు డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. అతని నుంచి రూ. 25 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విదేశీయుడు ఇచ్చిన సమాచారంతో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా సమాచారంతో ఇవాళ మేడ్చల్‌లో దాడులు చేసి.. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

