‘అన్నదాత పోరు’ పోస్టర్‌ను ఆవిష్కరించారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి. ఈ నెల 9న రైతుల సమస్యలపై రైతు పోరు బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసన చేపడాతమని వెల్లడించారు.
రైతులు, వ్యవసాయ సంఘాలతో కలసి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నిరసన గళాన్ని వినిపిస్తాం… తక్షణం ప్రభుత్వం స్పందించి రైతాంగ డిమాండ్‌లపై దిగిరావాలి అన్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్‌ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ చేయాలి అని డిమాండ్ చేశారు సజ్జల. ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలి అన్నారు.
జగన్ నాయకత్వంలో గత అయిదేళ్ళ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన పాలనలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఎప్పుడూ లేనివిధంగా వ్యవసాయం రంగంలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. విత్తనం నుంచి విక్రయం వరకు అడుగడుగునా రైతన్నను చేయి పట్టి నడిపించారు. వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీలో 20 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలోనే చేసి చూపించారు అన్నారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఉన్న దారుణమైన పరిస్ధితులను 15 నెలల్లోనే తీసుకొచ్చారు. ఎరువులను అక్రమంగా నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రైతులే రోడ్డెక్కి ప్రశ్నిస్తుంటే వారికి వైయస్ఆర్‌సీపీ ముద్ర వేయడం, బొక్కలో వేస్తామని రైతుల్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు బెదిరిస్తున్నారు అన్నారు.
Also Read:పుష్ప 3పై సుకుమార్ క్లారిటీ

