శ్రద్ధా శ్రీనాథ్‌..ది గేమ్!

8
- Advertisement -

నెట్‌ఫ్లిక్స్ తొలి తమిళ వెబ్ సిరీస్ ది గేమ్. నటి శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా తూంగా వనంకు దర్శకత్వం వహించిన రాజేష్ ఎం. సెల్వా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.

మొదటి లుక్ పోస్టర్‌తో పాటు ప్రీమియర్ తేదీని కూడా ప్రకటించారు. ఈ సిరీస్ అక్టోబర్ 2, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. డిజిటల్ ప్రపంచంలో హీరోయిన్ ఎదుర్కొనే సవాళ్లు, ఆ కారణంగా ఆమె ప్రాణాలకు ఏర్పడే ముప్పు చుట్టూ కథ తిరుగుతుంది.

ఇందులో శ్రద్ధా గేమ్ డెవలపర్‌గా కనిపించనున్నారు. సంతోష్ ప్రత్యాప్, చందిని, శ్యామ హరిని, బల హసన్, సుబాష్ సెల్వం, వివియా సంతో, ధీరజ్, హేమ కీలకపాత్ర పోషించారు. ఈ సిరీస్‌ను అప్లాజ్ సౌత్ నిర్మిస్తుండగా, దీప్తి గోవిందరాజన్ కథ రాశారు. ప్రీమియర్ సమయం దగ్గరపడే కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Also Read:రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్

- Advertisement -