56వ GST కౌన్సిల్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ మీటింగ్‌పై అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా జీఎస్టీ స్లాబ్‌ల మార్పు నేపథ్యంలో ఏఏ వస్తువుపై ఎంత జీఎస్టీ విధిస్తారు అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం అమలులో ఉన్న 5%, 12%, 18%, 28% అనే నాలుగు స్లాబ్స్‌ను సరళతరం చేసి రెండు స్లాబ్స్‌గా మార్చే ప్రతిపాదనపై కౌన్సిల్ (రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కూడినది) చర్చించనుంది. ప్రస్తుతం 28% GST ఉన్న వస్తువులను 18% కు తగ్గించే అవకాశముంది. 18% స్లాబ్లో ఉన్నవి 12% కి లేదా 5% కి చేర్చే అవకాశం ఉంది.
లాభం పొందే రంగాలు
ఆటోమొబైల్: చిన్న కార్లు (1200ccలోపు ఇంజిన్), మోటార్‌సైకిళ్లు (350ccలోపు), ఆటో పార్ట్స్ – 28% నుండి 18%.
హాస్పిటాలిటీ & ఎంటర్టైన్మెంట్: హోటల్ స్టేలు, సినిమా టికెట్లు – 12% నుండి 5%.
హెల్త్‌కేర్: క్యాన్సర్ మందులకు GST మినహాయింపు. ఇతర ఔషధాలు, మెడికల్ సరఫరాలు 12% నుండి 5%. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ మినహాయింపు.
డైలీ యూజ్ వస్తువులు: పనీర్, పిజ్జా బ్రెడ్, ఖాఖ్రా, ఫ్రూట్ జ్యూసెస్, కొబ్బరి నీరు, వెన్న, చీజ్, పాస్తా, ఐస్‌క్రీమ్ – 12% నుండి 5% లేదా మినహాయింపు.
వ్యవసాయం, ఎరువులు: సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, అమోనియా – 18% నుండి 5%.
టెక్స్టైల్స్: సింథటిక్ యార్న్, మాన్‌మేడ్ ఫైబర్ యార్న్, కార్పెట్లు, హ్యాండీక్రాఫ్ట్స్ – 12% నుండి 5%.
సోలార్ కుకర్: 12% నుండి 5%.
స్టేషనరీ: రబ్బర్లు (erasers) – మినహాయింపు, మ్యాప్స్, చార్ట్స్, నోట్‌బుక్స్, అట్లాస్ – 12% నుండి 5%.
Also Read:తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష
టాయిలెట్రీస్: టూత్‌పౌడర్ 12% నుండి 5%, టూత్‌పేస్ట్ 18% నుండి 12%, షాంపూ, ఆయిల్, సోప్ – 18% నుండి 5%.
అంబ్రెల్లా: 5%.
హోటల్ బుకింగ్స్: రూ.7,500లోపు అద్దె ఉన్న గదులపై GST 12% నుండి 5%.
ఎవరికి నష్టం?
లగ్జరీ & సిన్ గూడ్స్: తమాకు, పాన్ మసాలా, లగ్జరీ కార్లు – 40% సిన్ ట్యాక్స్.
ఎలక్ట్రిక్ వాహనాలు (EVs):
రూ.20–40 లక్షల EV కార్లు – 5% నుండి 18%.
రూ.40 లక్షలకుపైగా లగ్జరీ EVలు – 40%.
కోల్ & ఎనర్జీ ప్రొడక్ట్స్: కోల్ 5% నుండి 18%, విద్యుత్ ఖర్చులు పెరగవచ్చు.
అప్పారెల్: ఒక్కో డ్రెస్ రూ.2,500 దాటితే 12% నుండి 18%.

