శోధ కన్‌స్ట్రక్షన్స్‌పై ఈడీకి ఫిర్యాదు

3
- Advertisement -

రేవంత్ రెడ్డి బావమరిది శోధ కన్స్ట్రక్షన్స్ పై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ ఈడి కేంద్ర కార్యాలయంకు వెళ్లారు బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్. కేవలం 7 లక్షల ఆర్థిక లావాదేవీలు ఉన్న రేవంత్ రెడ్డి బావమరిది శోధ కన్స్ట్రక్షన్స్‌కు అమృత్ టెండర్లు, సింగరేణి మైనింగ్ కాంట్రాక్టు, దిండి ఇరిగేషన్ కాంట్రాక్టు ఇవ్వడంపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు క్రిశాంక్.

గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నపుడు ఏ కంపెనీ పేరుపై ఉన్న కారు వాడాడో ఇప్పుడు అదే KLSR ఇన్ఫ్రాటెక్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం 650 కోట్ల విలువ గల మూడు కాంట్రాక్టులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం అన్నారు.

Also Read:నటి ధన్సికతో విశాల్ ఎంగేజ్‌మెంట్!

ఇటీవలే ఒక సంచలన కేసులో ఒత్తిడి పెడుతున్నారని తప్పుకున్న జడ్జి విషయంలో KLSR ఇన్ఫ్రాటెక్ మరియు సీఎం రేవంత్ సంబంధం పై విచారణ జరపాలని కూడా ఫిర్యాదు చేశారు.

- Advertisement -