రుషికొండ భవనాలు దెబ్బతిన్నాయి:పవన్

5
- Advertisement -

రుషికొండ భవనాలు దెబ్బతిన్నాయి అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పెచ్చులు ఊడిపోతున్నాయి, కొన్ని చోట్ల లీకేజ్ అవుతోంది అన్నారు. రూ.453 కోట్లతో మొత్తం 4 బ్లాక్ లు నిర్మించారు అన్నారు.

గతంలో రిసార్ట్స్ గా ఉన్నప్పుడు ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయం వచ్చేది… కానీ ప్రస్తుతం కరెంటు బిల్లులకే ఏడాదికి రూ.15 లక్షలు అవుతోంది అన్నారు. రుషికొండ భవనాలను ఏ విధంగా ఆదాయ మార్గంగా ఉపయోగించాలనే దానిపై ప్రధానంగా చర్చించాం అన్నారు.

రిషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలని అనే దానిపై కసరత్తు చేస్తున్నామని… ప్రతి ఫ్లోరు, రూములతో పాటు ఫర్నీచర్ ను పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉండగా రిషికొండ భవనాల్లోని ప్రతి విభాగం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు పవన్.

Also Read:హ్యాపీ బర్త్ డే..నాగార్జున

- Advertisement -