- Advertisement -
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం మిరాయ్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ పై భారీ అంచనాలు నెలకొనగా తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. 9 గ్రంథాలను కొంతమంది కాపాడుతుంటే వాటిని అందుకోవాలని విలన్(మంచు మనోజ్) ట్రై చేస్తుంటాడు. అతన్ని ఆపడానికి, త్రేతాయుగంలోని మిరాయ్ అనే ఆయుధాన్ని హీరో(తేజ సజ్జా) ఎలా సాధిస్తాడు, విలన్ ని ఎలా ఆపుతాడు అనే కథాంశంతో ఉండబోతుందని తెలుస్తుంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. రితికా నాయక్, మంచు మనోజ్, శ్రియ, జగపతి బాబు, జయరాం కీలక పాత్ర పోషిస్తుండగా సెప్టెంబర్ 12 రిలీజ్ కానుంది.
- Advertisement -

