హాట్‌ టాపిక్‌ గా మారిన అమలా కామెంట్స్..!

242
- Advertisement -

కెరీర్‌ మంచి స్వింగ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది మలయాళ కుట్టి అమలాపాల్‌. చిన్న వయసులోనే దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడిన అమల.. అతణ్ని పెళ్లి చేసుకుంది.

అయితే ఆ బంధం ఎంతో కాలం సాగలేదు. భర్త నుంచి విడాకులు తీసుకున్న అమల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ధనుష్‌తో ‘వీఐపీ-2’ (రఘువరన్‌ బీటెక్‌)లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడీ భామ ధనుష్ కి మంచి భార్యనవుతానని చెప్పి అందరికీ షాకిచ్చింది.

  Amala Paul Wishes to Become A Good Wife

‘వేలై ఇల్లా పట్టాధారి’ (‘వీఐపీ’ తెలుగులో ‘రఘువరన్ బీటెక్’) సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ‘వీఐపీ-2’ సినిమా ప్రమోషన్ ను అమలాపాల్ ప్రారంభించింది.

ఈ మేరకు ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమలాపాల్ మొదటి భాగంలో ధనుష్ కు మంచి ప్రియురాలిగా నటించానని గుర్తుచేసింది. ఈ భాగంలో ధనుష్ ను వేధించే ఇల్లాలిగా కనిపిస్తానని చెప్పింది. మూడో భాగం తీస్తే అందులో ధనుష్ కు మంచి భార్యగా నటిస్తానని చెప్పింది.

 Amala Paul Wishes to Become A Good Wife

కాగా, ‘సుచీ లీక్స్’ కారణంగా ధనుష్ తో అమలాపాల్ కు మంచి అనుబంధం ఉందంటూ గుసగుసలు వినిపించగా, ధనుష్ తో గడిపిన వీడియో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ఆమె వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

కాగా, అమలాపాల్ పెళ్లి పెటాకులు కావడం వెనుక కారణం కూడా ధనుషే అంటూ కోలీవుడ్ లో పుకార్లు షికార్లు చేశాయి. అయితే ‘వీఐపీ’ మూడో భాగం ఉందో, లేదో తెలియదుగానీ…అందులో ధనుష్‌కి భార్యనవుతానని చెప్పడమే ఇప్పుడు హాట్‌ టాపిక్ అయింది.

- Advertisement -