శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణకు దిగి, దాడికి పాల్పడ్డ ఘటన గురించి శాఖ ఉన్నతాధికారులు వివరించారు అని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఘటనల్లో శాసనసభ్యులు, ఆయన అనుచరుల ప్రమేయంపై విచారించి సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాను. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టంగా చెప్పాను అన్నారు.
చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడి ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదని, ఇందుకు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఒకటే అని, అరెస్టయిన 31వ రోజు పదవి కోల్పోయే చట్టం తీసుకురాబోతోంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్నారు.
‘మేము తప్పు చేసినా బాధ్యులను చేయమని రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా శాసన సభలో స్పష్టంగా చెప్పాము. నిబద్ధతతో, నియంత్రణతో విధులు నిర్వర్తిస్తున్నాము. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నవారు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలి. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు అన్నారు.
Also Read:రైతులను పట్టించుకోరా?:కేటీఆర్
శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణకు దిగి, దాడికి పాల్పడ్డ ఘటన గురించి శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఈ ఘటనల్లో శాసనసభ్యులు, ఆయన అనుచరుల ప్రమేయంపై విచారించి సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాను. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని…
— Pawan Kalyan (@PawanKalyan) August 20, 2025

