బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. మనిషిగా పుట్టిన తర్వాత ప్రజలు గుర్తు పెట్టుకునేలా బతకాలని చంద్రబాబు హితవు పలికారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు P-4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు.
ఏపీలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చింది P-4 అమలు కార్యక్రమం. మంగళగిరిలో జరుగుతోంది P-4 అమలు కార్యక్రమం. ఉగాది రోజు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా.. ఇప్పటివరకు బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ఎంపిక ప్రక్రియను చేపట్టింది ప్రభుత్వం.
Also Read:ధురంధర్ మూవీ సెట్‌లో ఫుడ్ పాయిజన్!
పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలు గుర్తించారు. మార్గదర్శులుగా ముందుకొచ్చారు 1.40 లక్షల మంది పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులు. పీ-4 ద్వారా హెచ్‍సీఎల్ కంపెనీలో ఉద్యోగం కల్పించటంతో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు కృష్ణా జిల్లావాసి పావని.

