War2:వసూళ్లెంతో తెలుసా!

6
- Advertisement -

బాలీవుడ్‌లో అంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో ఒకటి “వార్ 2”. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. హృతిక్ రోషన్, బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.

నైజాం ప్రాంతంలో ఆదివారం (4వ రోజు) ఈ చిత్రం రూ.1.30 కోట్లు వసూలు చేసింది. ఇది శనివారం వసూలైన రూ.1.65 కోట్ల కంటే కొద్దిగా తక్కువ. సెలవు రోజు కావడంతో ఎక్కువ వసూళ్లు ఆశించగా, మిశ్రమమైన టాక్‌ మరియు “కూలీ” సినిమా పోటీ వసూళ్లపై ప్రభావం చూపించాయి.

Also Read:KTR:యువకుల మృతి కలిచివేసింది

ఇలా 4 రోజుల మొదటి వీకెండ్ కలిపి (అన్ని భాషల్లో) వసూళ్లు దాదాపు రూ.10 కోట్లకు చేరుకున్నాయి. ఈ వారం మరింత వసూళ్లు ఎంత వరకు సాధిస్తుందో చూడాలి.

- Advertisement -