సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ సూపర్ హిట్ కాగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది.
సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను చెబుతున్నారు.తలైవరర్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొనే డైరెక్టర్ లోకేష్ ‘కూలీ’ సినిమాలో రజనీని అద్భుతంగా ప్రజెంట్ చేశారని తెలుస్తోంది. టైటిల్ కార్డ్, ఇంట్రో సీన్ సూపర్బ్‌గా ఉందని చెబుతున్నారు.
సైమన్ అనే విలన్ రోల్ లో నాగార్జున ఇంప్రెస్ చేశాడని చెబుతున్నారు. విలన్‌గా అద్భుతంగా నటించాడని.. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ రజనీకాంత్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తాయని చెబుతున్నారు. పూజా హెగ్డే చేసిన ‘మోనికా’ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని చెబుతున్నారు.
Also Read:హైదరాబాద్ మెట్రోకు విద్యుత్ శాఖ షాక్

