చంద్రబాబు,పవన్‌లకు తారక్ థ్యాంక్స్

7
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఎన్టీఆర్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. రేపు(ఆగస్టు 14) విడుదల కానుంది ఎన్టీఆర్ చిత్రం ‘వార్ 2’. ఈ నేపథ్యంలో చిత్రానికి అదనపు షో కేటాయిస్తూ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

దాంతో బాటు టికెట్ రేట్లు కూడా పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు తారక్.

ఏపీలో ‘వార్ 2’ సినిమా ప్రీమియర్ షో టికెట్ రేట్లు రూ.500కు పెంచేందుకు అనుమతినిచ్చింది ఏపీ ప్రభుత్వం. ‘వార్ 2’ సినిమా రిలీజ్ డే రోజు ఉదయం 5 గంటల ప్రీమియర్ షోకు అనుమతించింది. అలాగే సినిమా రిలీజ్ డే నుంచి ఆగస్టు 23 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది.

- Advertisement -