- Advertisement -
సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా టికెట్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఈ మేరకు అదనపు షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈనెల 14 నుంచి 23 వరకు సినిమా టికెట్ల పెంపునకు అనుమతించింది. సింగల్ స్క్రీన్ థియేటర్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు అదనంగా పెంచుకోవడానికి ఉత్తర్వులు జారీ చేసింది.
14వ తేదీ ఉదయం బెనిఫిట్ షో కి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:కోమటిరెడ్డి ఉండాల్సింది జైలులో!
- Advertisement -

