పూణేలో విషాదం..ప్రధాని దిగ్బ్రాంతి

6
- Advertisement -

మహారాష్ట్రలోని పూణేలో పెను విషాదం నెలకొంది. వ్యాన్ లోయలో పడి 10 మంది మృతి చెందారు. దాదాపు 27 మందికి తీవ్ర గాయాలుకాగా శ్రావణ మాసం పవిత్ర సోమవారం సందర్భంగా ఖేడ్ తహసీల్‌లోని శ్రీ క్షేత్ర మహాదేవ్ కుందేశ్వర్ ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

పూణే ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం ప్రకటించారు మోదీ. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం, గాయపడినవారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.

Also Read:OTT:ఈ వారం ఓటీటీ సినిమాలివే!

- Advertisement -