గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ ఏరివేతనే టార్గెట్గా తూర్పు గాజా నగరంలోని అల్-షిఫా ఆస్పత్రి సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
మొత్తంగా ఈ దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ అధికారులు తెలిపారేఉ. అనాస్ అల్ షరీఫ్ అనే వ్యక్తి ఆల్ జజీరా సంస్థలో చేరి జర్నలిస్టు ముసుగులో ఇజ్రాయెల్ పై దాడులకు కుట్రలు పన్నుతున్నారని తెలిపింది. గాజా నుంచి సేకరించిన పత్రాలు, ఉగ్రవాదుల శిక్షణ జాబితా, వేతన రికార్డులను పరిశీలించిన తరువాత అతడు హమాస్ ఉగ్రవాది అని నిర్దరించినట్లు తెలిపింది.
Also Read:ఎంపీలకు నూతన నివాసాలు
గాజాలో అత్యంత ధైర్యవంతులైన జర్నలిస్టుల్లో అనాస్ అల్ షరీఫ్ ఒకరని అల్ జజీరా పేర్కొంది. గాజా యుద్ధంపై ఫ్రంట్లైన్ రిపోర్టింగ్ చేసినందుకు అతన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు చేసిందని పాలస్తీనా జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది.

