హంద్రీనీవా..కృష్ణమ్మ పరవళ్లు

14
- Advertisement -

హంద్రీ నీవా లో కృష్ణమ్మ పరవళ్లతో మనసు పులకరిస్తోందంటూ వీడియో ట్యాగ్ చేసి ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగు నీరందించే హంద్రీ-నీవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి నా మనసు పులకరిస్తోంది అని తెలిపారు.

ప్రతి ప్రాజెక్టు నిండేలా.. ప్రతి చెరువుకు నీరందేలా… చివరి భూములను సైతం తడిపేలా.. అత్యధిక సామర్థ్యంతో హంద్రీ-నీవా కాల్వల్లోని నీటి ప్రవాహాలు రైతన్నల ఆశలను, ఆకాంక్షలను తీరుస్తున్నాయి అని తెలిపారు.

రికార్డు సమయంలో కాల్వల విస్తరణ చేపట్టిన కారణంగానే ఈ సీజన్లో చివరి భూములకు నీరందించాలనే మా కల సాకారమవుతోంది. రైతుల సంతోషం మా సంకల్పానికి మరింత బలాన్ని ఇస్తోందన్నారు చంద్రబాబు.

Also Read:భారీ వర్షాలు..తెలంగాణలో హై అలర్ట్!

- Advertisement -