- Advertisement -
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు హై అలర్ట్ ప్రకటించింది తెలంగాణ వాతావరణ శాఖ. ఈనెల 14 నుంచి 17 వరకు అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లోనూ ఒకట్రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆగస్టు 15న భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read:కేసీ వేణుగోపాల్‌కు తప్పిన ప్రమాదం
- Advertisement -

