ఒక ప్రైవేట్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ గురించి పొగిడారు ఎంఎస్ ధోని. విరాట్ కోహ్లీ చాలా మంచి గాయకుడు, గొప్ప నృత్యకారుడు, మిమిక్రీలో కూడా గొప్పవాడు, చాలా ఫన్నీగా ఉంటాడు మరియు పూర్తి వినోదాన్ని అందిస్తాడు అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో, మైదానం వెలుపల కూడా అంతే ఫన్నీగా ఉంటాడు.. విరాట్ కోహ్లీ అన్ని రంగాల్లో అత్యుత్తముడు అని కితాబిచ్చారు.
Also Read:‘సు ఫ్రం సో’..బిగ్ బ్లాక్‌బస్టర్
ధోని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల పట్ల ఉన్న గౌరవాన్ని, ప్రేమను తెలియజేస్తున్నాయి అని కామెంట్ చేస్తున్నారు. ధోని, విరాట్‌ల మధ్య బంధం మొదటి నుంచీ కనిపిస్తోంది కానీ ధోని, యువరాజ్‌ల విషయంలో అలా చెప్పలేం అన్నారు.
MS DHONI TALKING ABOUT THE BOND WITH VIRAT KOHLI. ❤️ 🇮🇳 pic.twitter.com/Zg7HQVKK5C
— Johns. (@CricCrazyJohns) August 7, 2025

